Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర పండుగగా దసరా: మంత్రి పల్లె

వచ్చే సంవత్సరం నుంచి దసరాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. అందుకు ప్రభుత్వం తరపున నిర్ణయం తీసుకుంటామన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మవారిని మంత్రి దర్శించుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

More Telugu News